మునుగోడుకు తరలి వెళ్లాలని వారికి ఆదేశాలు

by Sumithra |   ( Updated:2022-10-07 11:40:40.0  )
మునుగోడుకు తరలి వెళ్లాలని వారికి ఆదేశాలు
X

దిశ, తలకొండపల్లి : తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును శుక్రవారం ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు శ్రీరాములు ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలందరూ తరలి వెళ్లాలని కేటీఆర్ ఆదేశించారని తెలిపారు. తమ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించుకొని రావాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు. మునుగోడు విజయం వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండం లాంటిదని కేటీఆర్ సూచించినట్లు ఎమ్మెల్సీ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి : Munugode bypoll ఎఫెక్ట్.. రంగంలోకి దిగిన పోలీసు బలగాలు

Advertisement

Next Story