- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎమ్మెల్సీ కవిత శుభవార్త
దిశ, ముషీరాబాద్: వాటర్ వర్క్స్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభవార్త చెప్పారు. త్వరలోనే కాంట్రాక్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. మంగళవారం టీఆర్ఎస్ కేవీ అనుబంధ వాటర్ వర్క్స్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ క్యాలెండర్‌ను ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జీవో 14 అమలుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
ఉద్యోగ కార్మికులంతా మరింత పట్టుదలతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్మిక, ఉద్యోగుల పక్షపాత ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఆయన ఉన్నంతకాలం మనకు ఎలాంటి ఇబ్బంది లేదని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కేవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వాటర్ వర్క్స్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నారాయణ, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారత్నం సంతోష్, ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్, యూనియన్ నాయకులు బాలరాజ్, శ్రీనివాస్ రెడ్డి, సురేష్, నరేందర్, పాండు, రామ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.