- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Minister Sridhar Babu : టీచర్ల మధ్య సమన్వయ లోపం వల్లే సమస్యలు
దిశ, శంషాబాద్ : టీచర్లలో సమన్వయ లోపం వల్లే విద్యార్థులకు సమస్యలు వచ్చాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆదివారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కలెక్టర్ శశాంక, డిప్యూటీ కలెక్టర్ ప్రతిపత్తి సింగ్ తో కలిసి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. మంత్రి శ్రీధర్ బాబు విద్యార్థులను అడగకగా విద్యార్థులు పాఠశాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయని ముఖ్యంగా అన్నంలో పురుగులు వస్తున్నాయని అంతేకాకుండా పాఠశాల ఆవరణలో తమతో వెట్టి చాకిరి చేయిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబుకు తెలిపారు. చదువు చెప్పడానికి కూడా సరిగా టీచర్లు లేరన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఉన్న సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించాడని త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అన్నారు పాలమాకుల లోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో టీచర్ల మధ్య సమన్వయ లోపం వల్లే విద్యార్థులకు ఇలాంటి సమస్యలు వచ్చాయని ఇకనుంచి అలాంటి సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలను గత 20 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది అన్నారు ప్రతి పేదవారు ఉన్నత చదువులు చదవాలని ఉద్దేశంతో ఈ విద్యాసంస్థలను తీసుకురావడం జరిగిందన్నారు కొందరి అధికారులు టీచర్ల వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని దీనిపై విచారణ జరిపి వారి పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు పర్యవేక్షణ లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ శశాంకను మంత్రి ఆదేశించారు. నెలలో నాలుగు సార్లు అయినా అధికారులు సందర్శించి టీచర్ల పనితీరు విద్యార్థులకు అందుతున్న సేవలను పర్యవేక్షించాలి అన్నారు ఇకనుంచి ఏ గురుకుల పాఠశాలలో కానీ విద్యార్థులకు సమస్యలు ఉన్నాయని రాకూడదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పాలించిందని అప్పుడప్పుడైనా గురుకుల పాఠశాలలపై రివ్యూ నిర్వహించిన దాఖలాలు లేవన్నారు కొన్ని ఆసుపత్రిలో రోగులను ఎలుకలు తిన్న ఘటనలు ఎన్నో ఉన్నాయి మనందరికీ తెలుసు అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్, జిల్లా విద్యాధికారి సుందర్ రావు,తహసీల్దార్ రవీందర్ దత్తు, ఎంపీ ఓ ఉషా కిరణ్, శ్రీ ఐ నరేందర్ రెడ్డి, మాజీ జడ్పిటిసి నీరటీ తన్వీరాజ్, నాయకులు రాజు ముదిరాజ్, రవీందర్ నాయక్, శ్రీకాంత్ గౌడ్, మురళి గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, రాము నాయక్, ప్రవీణ్ గౌడ్,, కోటేశ్వర్ గౌడ్, ప్రభాకర్ యాదవ్, జలపల్లి నరేందర్, గడ్డం శేఖర్ యాదవ్, సంజయ్ యాదవ్, బొబ్బిలి శేఖర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.