- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ సర్పంచ్ మృతి.. మంత్రి సబిత ఇంద్రారెడ్డి సంతాపం
దిశ, శంకర్ పల్లి: శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ టంగుటూరు మాజీ సర్పంచ్ రెడ్డి మృతి పట్ల విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి సంతాపం తెలిపారు. శంకరపల్లి మండలం టంగుటూరు గ్రామంలో గురువారం మృతుడు రాజిరెడ్డి ఇంటి వద్ద చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి సంతాపం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీనియర్ నాయకుడి మృతి పట్ల ఆమె ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
తాను రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఆ కుటుంబంతో తమ కుటుంబానికి ఎంతో సాన్నిహిత్యం ఉండేదని, ఆయన ఆధ్యాత్మిక సేవా భావాలు కలిగి గ్రామ అభివృద్ధితో పాటు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా రైతులకు ఎనలేని సేవ చేశారని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శంకర్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాణిక్య రెడ్డి, శంకర్పల్లి మాజీ జెడ్పిటిసి కే నారాయణ, పీసీసీ కార్యవర్గ కార్యదర్శి ఉదయ మోహన్ రెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గండి చర్ల గోవర్ధన్ రెడ్డి పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ఆయా పార్టీల నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.