- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముడుపుల మత్తులో ఏడీఏంజీ అధికారులు..
దిశ, యాలాల : తాండూరు నియోజకవర్గంలో దోపిడీకి అడ్డేలేదు.. నిబంధనలకు విరుద్ధంగా తవ్వుకున్న వాళ్లకు తవ్వుకున్నంత అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో అందాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు. భూగర్భ గనుల శాఖ చెక్ పోస్టులో అధికారులు ముడుపులు దండుకొని మౌనంగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నన్నాయి. ఏటా మైనింగ్ మాఫియా రూ. కోట్లలో అక్రమార్జన చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఏడీఏంజీ అధికారులు ఏం చేస్తున్నట్లు. భూగర్భ గనుల శాఖ అధికారులు ముడుపులు దండుకొని తమకేమీ పట్టనట్లు వ్యవరిస్తున్నరని సమాచారం. ఏడీఏంజీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే మైనింగ్ మాఫియా ఆగడాలకు అడ్డే లేకుండా పోయినందన్న ఆరోపోణలు ఉన్నాయి.
అక్రమ రవాణాతో రాయల్టీకి గండి..
తాండూరు నియోజకవర్గం నుంచి భారీఎత్తున్న వివిధ రకాల ఖనిజాలు అక్రమంగా కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర తెలంగాణతో పాటు విజయవాడ విశాఖపట్నం ప్రాంతలకు అడ్డదారిలో తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాండూరు సమీపంలోని యాలాల మండలం లక్ష్మీ నారాయణపూర్ లో భూగర్భ గనుల శాఖ ఆధర్వంలో చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేశారు. కొడంగల్ బషీరాబాద్ రహదారిల్లో వచ్చే ఖనిజరవాణా వాహనాలను చెక్ పోస్ట్ లో తనిఖీ చేసి రాయల్టీ పై ముద్ర వేయాలి.
ఒక లారీ ఖనిజ వాహనానికి రాయల్టీ వేలల్లో చెల్లించాలి అయితే చెక్ పోస్ట్ లో అధికారులు చేతివాటంతో ఎంతో అంత కట్టించుకొని వదిలేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇట్లా రోజు 15 నుంచి 20 వాహనాలు తరలిస్తున్నట్లు అంచనా. ఇలా రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి నష్టం జరుగుతున్నట్లు సమాచారం. కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఉన్నత స్థాయి అధికారులు స్పందించి రాయల్టీ లేకుండా అక్రమంగా తరలిస్తున్న మైనింగ్ నియత్రించి ప్రభుత్వనికి ఆదాయం వచ్చేదిశగా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.