- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించుకోవాలి : ఎల్డీఎం రాంబాబు
by Sumithra |
X
దిశ ప్రతినిధి, వికారాబాద్ : సమాజంలో ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించుకోవాలని ఎల్.డీఎం రాంబాబు అన్నారు. జిల్లాలో ఆర్బీఐ ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు - 2023లో భాగంగా మంగళవారం ఎన్నెపల్లి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు 2-కే రన్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని ఎల్డీఎం రాంబాబు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కొరకు బ్యాంకులు పనిచేస్తున్నాయని, బ్యాంకింగ్ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈనెల 13 నుండి 17 వరకు జిల్లాలో లిటరసీ క్యాంపులు నిర్వహించి ప్రజలకు సైబర్ నేరాలపట్ల అవగాహన కల్పించనున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ రవికుమార్, వికారాబాద్ సీఐ శ్రీను, బ్యాంకర్లు, మెప్మా రిసోర్స్ పర్సన్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story