- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు ఫిర్యాదు
దిశ, శంషాబాద్: అధికార పార్టీ సర్పంచి, గ్రామ కమిటీ అధ్యక్షుడు కుమ్మకై గ్రామంలో అభివృద్ధి చేయకుండా అడిగినవారిని బెదిరిస్తున్నారని శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం చౌదర్ గూడా సర్పంచ్ రాజ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు నర్కుడ ఎంపీటీసి, చౌదరిగూడా ఉపసర్పంచ్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ చౌదర్ గూడా గ్రామం కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ అని, గ్రామంలో అభివృద్ధి చేయాలని వార్డు సభ్యులు పలుమార్లు కోరినా ఏమాత్రం పట్టించుకోకుండా ఒంటెద్దుపోకడ పోతున్నారన్నారు. దీని వల్ల గ్రామంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. 111 జీఓకు విరుద్ధంగా గ్రామంలో ఎన్నో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, వాటి వద్ద గ్రామ కమిటీ అధ్యక్షునితో కలిసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని అన్నారు. గతంలో ఎన్నోసార్లు అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. గ్రామంలో అభివృద్ధి చేయాలని అడిగితే తాను సర్పంచిని ఎమ్మెల్యే, ఎంపీపీ, జడ్పీటీసీ తమ పార్టీకి చెందినవారని మీరేం చేసుకుంటారో చేసుకోండి నన్నేంది ప్రశ్నించేదని బెదిరింపులకు గురి చేస్తున్నాడు అన్నారు. ఇప్పటికైనా సర్పంచ్ ఆగడాలపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుని గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గౌతమి అశోక్, ఉప సర్పంచ్ కళమ్మ, వార్డు సభ్యులు మచ్చలం మహేష్, పరిపూర్ణ, పొగాకు మహేశ్వరి, మామిళ్ళ మల్లేష్, మునగాల సంజీవ, బక్క ప్రశాంత్, బక్క భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.