- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ ఇక్కడ మోడీని తిట్టి ఢిల్లీలో కలుస్తాడు
దిశ, ఇబ్రహీంపట్నం : కేసీఆర్ ఇక్కడ మోడీని తిట్టి ఢిల్లీలో కలుస్తాడు అని భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రముక్ టౌన్షిప్ కాలనీ పార్కులో తెలంగాణ రాష్ట్ర రోడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సంస్థ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి తో కలిసి మార్నింగ్ వాకర్స్ తో ఆదివారం చిట్ చాట్ నిర్వహించారు. తుర్క యాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రముక్ టౌన్షిప్, అభ్యుదయ నగర్ కాలనీ, అంజనాద్రినగర్ కాలనీ, శ్రీనివాస రంగాపూర్ కాలనీ, లక్ష్మీ నగర్ టౌన్షిప్, కేఎస్ ఆర్ నగర్ కాలనీ, సూర్య నగర్ కాలనీ లకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు వారి కాలనీలో ఉన్నటువంటి సమస్యలను వివరించారు.
ఈ సందర్బంగా ఎంపీ అభ్యర్థి చామల మాట్లాడుతూ కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదన్నారు. లౌక్యం ఉందో లేదో కూడా నాకు తెలియదు అన్నారు. మోడీని తిట్టినట్టు నటిస్తాడు, ఢిల్లీకి వెళ్లి కలుస్తాడు అని ఎద్దేవా చేశారు. విభజన హామీల ప్రకారం రావలసిన నిధులు తీసుకొచ్చి మున్సిపాలిటీలను అభివృద్ధి చేసుకోవచ్చు కానీ అవేమీ పట్టించుకోకుండా కాలేశ్వరం ప్రాజెక్టు కమీషన్ ల మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద పెట్టలేదు అన్నారు. డ్రైనేజీ సమస్య తీవ్రంగా వేధిస్తుందని, మున్సిపాలిటీలలో మీరందరూ తనను ఆశీర్వదించి ఒక్కసారి అవకాశం ఇస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పట్టణాలు, మున్సిపాలిటీలు అభివృద్ధి చేస్తాను అన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు కొత్త కుర్మ సోమయ్య, మున్సిపల్ చైర్మన్ మల్ రెడ్డి మాధవి రామ్ రెడ్డి, కౌన్సిలర్ లు మర్రి మాధవి మహేందర్ రెడ్డి, ఉదయశ్రీ గోపాల్ రెడ్డి, హరిత యాదగిరి, కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.