- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీళ్లు మారరు..లీకేజీ ఆగదు..
దిశ, పరిగి : సీసీ రోడ్డు కింద మంచినీటి పైప్ లీకేజీని పదేపదే అధికారులు, పాలకుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం ఉండటం లేదంటూ పరిగి మున్సిపల్ ప్రజలు తప్పుపడుతున్నారు. పరిగి ప్రధాన మార్కెట్ గంజ్ రోడ్డులో కొంతకాలం క్రితం వేసిన సీసీ రోడ్డు కింద నుంచి మంచినీటి పైప్ లైన్ లీకేజీ అవుతోంది. ఈ లీకేజీని సరి చేయాలని మున్సిపల్ వాటర్ సిబ్బంది, కౌన్సిలర్, కమిషనర్, చైర్మన్ కు చెప్పినా సమస్య సమస్యగానే ఉందని అనుకుంటున్నారు.
ఇప్పటి వరకు పరిగిలో ఇద్దరు కమిషనర్లు మారినా సమస్యను ఎవరూ పట్టించుకోలేదు. కొత్త కమిషనర్ శ్రీనివాసస్ సారైనా స్పందిస్తారా అని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పరిగిలో శుక్రవారం మార్కెట్ కావడంతో మద్యాహ్నం సీసీ రోడ్డుపై నీరు లీకలై పాదచారులు, కూరగాయాలు విక్రయించేవారు. వాహన చోధలకు ఇబ్బంది ఎదుర్కొన్నారు. నీటి లీకేజీని అలాగే వదిలేస్తే సీసీ రోడ్డు నాణ్యత లోపించి త్వరగా పాడువుతుందని సూచిస్తున్నారు. అధికారులు, పాలకులు కాస్త స్పందిస్తే లీకేజీ సమస్య తీరుతుందని చెబుతున్నారు.