- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీర్ పేట్ లో జోరుగా అక్రమ నిర్మాణాలు
దిశ, మీర్ పేట్ : మీర్ పేట్ కార్పొరేషన్ లో జోరుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు మాత్రం కాసులకు కక్కుర్తి పడి అక్రమ నిర్మాణాలని అరికట్టాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవట్లేదని ప్రజలు బహిరంగానే విమర్శిస్తున్నారు. అక్రమ నిర్మాణాల వల్ల కార్పొరేషన్ ఆదాయానికి భారీగా గండి పడుతున్న అధికారులు మాత్రం తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు అని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మీర్ పేట్ కార్పొరేషన్ హైదరాబాద్ మహానరానికి కూతవేటు దూరంలో ఉంది కార్పొరేషన్ దినదిన అభివృద్ధి చెందుతుంది కాబట్టి కార్పొరేషన్ భారీగా విస్తరిస్తుంది. దీంతో బహుళ అంతస్తుల, అక్రమ నిర్మాణాలు జరుగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు అనే విధంగా తయారయింది టౌన్ ప్లానింగ్ విభాగం. పదులసంఖ్య లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న అధికారులు మాత్రం అందిన కాడికి దండుకుని అక్రమ నిర్మాణాల పై చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. పేదవాడు ఎక్కడైనా చిన్న గూడు నిర్మించుకుంటే చాలు క్షణాల్లో వాలిపోయి తట్టా పారా పట్టుకొచ్చే టౌన్ ప్లానింగ్ అధికారులకు బహుళ అంతస్తుల, అక్రమ నిర్మాణలు జరుగుతున్న మౌనంగా ఉండడానికి కారణం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణాదారులకు తో చేతులు కలిపి తమ జేబులు నింపుకోవడం తో కార్పొరేషన్ ఆదాయానికి కోట్లాది రూపాయలు గండిపడుతున్నది టౌన్ ప్లానింగ్ సిబ్బంది చర్యలు తీసుకోకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాదారులకు కొమ్ముకాస్తూ అందిన కాడికి దండుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
మేయర్ ఇలాకాలో అక్రమ నిర్మాణం
మేయర్ ప్రాతినిథ్యం వహిస్తున్న డివిజన్ మిథిలా నగర్ కాలనీ ఇది ఆర్ సీఐ ప్రధాన రహదారి పక్కనే నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా అనుమతులు లేకుండా ఓ అక్రమ నిర్మాణం జరుగుతుంది. అయినా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోరు. ఆ అక్రమ నిర్మాణం పక్క నుంచే హైటెన్షన్ వైర్లు ఉన్నాయి. అయినా అది ప్రమాదమని తెలిసిన అధికారులు మాత్రం అటు వైపు కన్నెత్తి చూడరు. ఎందుకంటే అది మేయర్ డివిజన్ కాబట్టి. ఆ భవనానికి ఎలా అనుమతులు ఇచ్చారా లేదా అనేది పలువురు ప్రశ్నిస్తున్నారు.
నూతనంగా నిర్మిస్తున్న ఓ భవన నిర్మాణానికి జీ ప్లస్ 2 కు పర్మిషన్ తీసుకున్నారు. అందుకు భిన్నంగా మూడు అంతస్తు పూర్తి చేసి 4 వ అంతస్తు వరకు పిల్లర్లు వేసి యేదేచ్ఛగా అక్రమ నిర్మాణం జరగుతున్నా.. అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు అంటే అర్థం చేసుకోవచ్చు అధికారులు ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారని.
రాఘవేంద్ర నగర్ కాలనీ మూడంతస్తుల అక్రమ నిర్మాణం జరుగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం పట్టదు. ఎందుకంటే సదురు అక్రమ నిర్మాణనికి అనుమతులు ఉన్నాయా అంటే ఉండవు. ఎందుకంటే ఆ అక్రమ నిర్మాణానికి స్థానిక కార్పొరేటర్ భర్త అండదండలు పుష్కలంగా ఉండడంతో ఆ అక్రమ నిర్మాణాన్ని పట్టించుకోరు అధికారులు వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తున్నది.
టౌన్ ప్లానింగ్ విభాగానికి పూర్తి స్థాయి అధికారి లేకపోవడంతో టౌన్ ప్లానింగ్ సిబ్బంది అన్నీ తామై చక్రం తిప్పుతున్నారని కార్పొరేషన్ లో బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి. గత మార్చి 31న టౌన్ ప్లానింగ్ అధికారి పదవీ విరమణ చేయడం తో ఒక నెల తర్వాత తెల్లాపూర్, జహీరాబాద్ రెండు మున్సిపాలిటీలు చూసే అధికారికి మీర్ పేట్ టౌన్ ప్లానింగ్ ఇంఛార్జి అదనపు బాధ్యతలు అప్పాచెప్పారు. దీంతో అతను వారంలో రెండు రోజులు మాత్రమే ఇక్కడ విధులు నిర్వహించేది వారంలో మిగిలిన నాలుగు రోజులు ఇక్కడ ఉండకపోయేవాడు ఆ అధికారి కూడా ఈ మధ్యకాలంలో అదనపు బాధ్యతలు తప్పించడంతో మరో మహిళా అధికారి వికారాబాద్ ,పోచారం రెండు మున్సిపాలిటీ తో పాటు మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ సైతం ఆ అధికారి చూస్తున్నారు వారంలో సోమవారం, మంగళవారం రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉండడంతో.దీంతో టౌన్ ప్లానింగ్ విభాగం లో పనిచేసే సిబ్బందితో పాటు చైన్ మేన్ లు అన్నీ తామై నడిపించడంతో వారు చెప్పిందే నడుస్తుంది దీంతో టౌన్ ప్లానింగ్ విభాగం పూర్తిగా కుంటు పడిందని చెప్పవచ్చు.