- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మసాజ్ సెంటర్ల పేరుతో అక్రమ వ్యాపారం..
దిశ, షాద్ నగర్ : హైదరాబాద్ లాంటి మహానగరాల్లో నిర్వహించే స్పా బాడీ మసాజ్ సెంటర్లు ఇప్పుడు ఏకంగా షాద్ నగర్ లాంటి పట్టణాలకు చేరి గుట్టుచప్పుడు కాకుండా మసాజ్ సెంటర్ నడిపిస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో మసాజ్ సెంటర్ నడిపిస్తున్నారు. షాద్ నగర్ పట్టణంలో మహబూబ్ నగర్ రోడ్డులో సెల్లార్లో గుట్టుచప్పుడు కాకుండా ఫ్రెండ్స్ ప్రొఫెషనల్ పేరుతో యువతులతో మసాజ్ సెంటర్ నడిపిస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేశారు.
షాద్ నగర్ పట్టణంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్ పై షాద్ నగర్ ఏసీపీ కుశాల్కర్ దాడులు నిర్వహించారు. ఏసీపీ తన గన్ మెన్ రహస్యంగా ఈ మసాజ్ సెంటర్ కి పంపి మసాజ్ చేయాలని కోరగా ఆడవాళ్ళతో మసాజ్ చేయిస్తారని అందిన పక్కా సమాచారంతో ఈ సెంటర్ పై దాడి చేశారు. ఈ ఆపరేషన్లో ముగ్గురు యువతులని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిర్వాహకులు పరారీలో ఉన్నారని వాళ్ళను కూడా అదుపులోకీ తీసుకుంటామని పే ఏసీపీ కుషాల్కర్ మీడియాకు తెలిపారు.