Collector : హైదరాబాద్ ప్రజావాణి ఒకరోజు వాయిదా

by Kalyani |
Collector : హైదరాబాద్ ప్రజావాణి ఒకరోజు వాయిదా
X

దిశ ప్రతినిధి వికారాబాద్ : మహాత్మా జ్యోతిబాపూలే హైదరాబాద్ ప్రజాభవన్ లో ప్రతి శుక్రవారం, మంగళవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈనెల (సెప్టెంబర్ 11) కు వాయిదా వేసినట్లు ప్రజాపాలన ప్రత్యేక అధికారి డి.దివ్య తెలిపారని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అర్జీలను స్వీకరించేందుకు ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 10న ప్రజాభవన్ లో 16వ కేంద్ర ఆర్థిక సంఘంతో ముఖ్యమైన సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ప్రజావాణిని మంగళవారానికి బదులు బుధవారానికి మార్చినట్లు, ఈ విషయాన్నీ అర్జీదారులు గమనించగలరని జిల్లా కలెక్టర్ తెలిపారు.

Next Story

Most Viewed