మా నాన్నను గెలిపించండి.. రంజిత్ రెడ్డి తనయుడి ప్రచారం

by Nagaya |
మా నాన్నను గెలిపించండి.. రంజిత్ రెడ్డి తనయుడి ప్రచారం
X

దిశ, రాజేంద్రనగర్ : చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, తన తండ్రి రంజిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన తనయుడు ఆర్యన్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. డెయిరీ డెవలప్మెంట్ సంస్థ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, టీపీసీసీ సెక్రటరీ సానెం శ్రీనివాస్ గౌడ్, మైలార్ దేవుపల్లి డివిజన్ ప్రెసిడెంట్ ధనుంజయ, డివిజన్ ఎన్నికల కోఆర్డినేటర్ సామ ఇంద్రపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మైలార్దేవుపల్లి డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ నేతాజీ నగర్ వెంకటేశ్వర కాలనీ తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యన్ రెడ్డి నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. నిస్వార్థంతో సేవ చేస్తున్న తన తండ్రిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీహెచ్ గోపాల్ శ్రీనివాస్ గుప్తా, సబితా రెడ్డి బ్రహ్మచారి, గోపాల్, అనిత, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed