- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అక్రమ నిర్మాణాలకు అడ్డాగా హిమాయత్ సాగర్ జలాశయం
దిశ,శంషాబాద్ : శంషాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు రావడంతో భూముల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్లాలన్నా శంషాబాద్ రావాల్సిందే దీన్ని ఆసరాగా తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖుల సైతం శంషాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫామోజులు గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదునుగా రాజకీయ నాయకుల అండ దండలతో చెరువులు, కుంటలు, వరద కాలువలను సైతం వదలకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.
అయితే హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించే హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాలకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నుంచి 10 కిలోమీటర్ల వరకు ఎలాంటి వెంచర్లకు, గెస్ట్ లు, ఫామ్ హౌస్ లకు, పరిశ్రమలకు అనుమతి ఇవ్వకూడదనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వాలు 111 జీవో తీసుకువచ్చింది. అయితే ఈ 111 జీవో పేదలకు మాత్రమే పెద్దలకు వర్తించదు అనే విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ ప్రముఖులు కొందరు అధికారుల అండదండలతో బరితెగించి ఏకంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ గ్రామ పరిధిలోని హిమాయత్ సాగర్ జలాశయం ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో వందల సంఖ్యలో భారీ ఎత్తున ఫామ్ హౌస్ లు, గెస్ట్ హౌస్ లు, యదేచ్చగా అక్రమంగా కట్టడాలు నిర్మిస్తున్నారు.
హిమాయత్ సాగర్ జలమండలి అధికారులు ఏర్పాటు చేసిన ఎఫ్టీఎల్, బపర్ జోన్ హద్దు రాళ్ళను సైతం తొలగించి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారంటే వారికి జలమండలి, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల అండ దండలు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.111 జీవో, ఎఫ్టిఎల్, బఫర్ జోన్ లాంటి నియమ నిబంధనలు తమకు ఏమాత్రం వర్తించమని ఏకంగా హిమాయత్ సాగర్ జలాశయానికి పూర్తిస్థాయిలో నీరు వస్తే ప్రముఖుల గెస్ట్ హౌస్ లు మునిగిపోతాయంటే ఏ విధంగా బరితెగించి నిర్మాణాలు చేశారు వాటికి మున్సిపల్ అధికారులు సైతం ఇంటి ఇంటి నెంబర్ ఇచ్చారంటే వారికి ప్రభుత్వం అండదండలు పుష్కలంగా ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా జలమండలి, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు స్పందించి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో నిర్మించిన అక్రమ నిర్మాణ దారులపై చర్యలు తీసుకోవాలని కూల్చివేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్ లో నిర్మించిన అక్రమ నిర్మాణాలకు సహకరించిన అధికారుల పైన సైతం చర్యలు తీసుకోవాలంటున్నారు.
ఇటీవల ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, నాళాలు, వరద కాలువలను రక్షించడానికి హైడ్రా కమిటీని ఏర్పాటు చేసి కబ్జా చేసిన అక్రమ నిర్మాణాలను దారులపై ఉక్కు పాదం మోపి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే అయితే, హైడ్రా కమిటీ హిమాయత్ సాగర్ జలాశయంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించి అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, హిమాయత్ సాగర్ జలాశయాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.