ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు

by Sridhar Babu |
ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు
X

దిశ,ఆమనగల్లు : నీటి వసతులు ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేస్తే రైతులు ఎక్కువ లాభాలు పొందవచ్చని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం కడ్తాల్ మండలం చెల్లంపల్లి గ్రామంలో మండల ఉద్యాన అధికారి సౌమ్య ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రతి రైతు ఆయిల్ ఫామ్ తోట సాగు చేసుకోవాలని, ఈ పంట వలన అధిక లాభాలు పొందవచ్చు అని రైతులకు సూచించారు.

ఆయిల్ ఫామ్ తోటలకు చీడ పీడలు సోకే ఆస్కారం తక్కువ అని, సాగు చేయాలనుకున్న రైతులకు మొక్కలకు 90 శాతం రాయితీ, డ్రిప్ ఏర్పాటుకు 80 శాతం నుంచి 100 శాతం రాయితీ వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి సురేష్, ఏడీహెచ్ కిషన్, ఏడీఏ ఆదిలక్ష్మి, ఎంపీడీవో సుజాత, ఎమ్మార్వో ముంతాజ్ బేగం, ఏఓ శ్రీలత, ఆయిల్ ఫామ్ ఫీల్డ్ ఆఫీసర్ హిమ్మ కుమార్, రమేష్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed