లగచర్ల గ్రామంలో హై అలర్ట్.. భారీ పోలీసు బందోబస్తు..

by Aamani |
లగచర్ల గ్రామంలో హై అలర్ట్.. భారీ పోలీసు బందోబస్తు..
X

దిశ ప్రతినిధి వికారాబాద్ / బొంరాస్పేట్ : సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారుల పై జరిగిన దాడి సంఘటనపై పోలీసులు అరెస్టుల పరంపర కొనసాగుతోంది. స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరగడంతో తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. సోమవారం అర్ధరాత్రి 2 గంటల నుంచి 3 డీసీఎంలతో వచ్చి దాదాపు 50 కి పైగా మందిని అరెస్టు చేసి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. గ్రామంలో ప్రతి ఇంటికి తాళం, ఫోన్ మొత్తం స్విచ్ ఆఫ్ ఆయన పరిస్థితి ఉంది. అలాగే జామర్లతో సిగ్నల్స్ మొత్తం నిలిపివేయడంతో ఇంటర్నెట్ సదుపాయాలు ఆగిపోయాయి.

బొంరాస్పేట్, దుద్యాల, కొడంగల్ ఎక్కడికి వెళ్లిన సిగ్నల్స్ రావడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఫోన్ మాట్లాడడానికి సిగ్నల్స్ వస్తున్నప్పటికీ అక్కడ నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వాలని స్థానికులు భయపడుతున్నారు. గ్రామం మొత్తాన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఎవరు బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అరెస్టు చేసిన వ్యక్తులను అందరిని విచారించి, నేరానికి ప్రధాన కారణమైన వారిపై కేసులు పెట్టి ఈరోజే రిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇలాంటి సంఘటనల పట్ల నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో మరిన్ని జరిగే అవకాశం ఉంది కాబట్టి పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని తెలుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed