నగర శివారుల్లో అంబరాన్నంటిన న్యూ ఇయర్‌ వేడుకలు

by Mahesh |
నగర శివారుల్లో అంబరాన్నంటిన న్యూ ఇయర్‌ వేడుకలు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: నూతన సంవత్సరానికి జిల్లా ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. డిసెంబర్‌ 31 వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. నగర శివార్లలోని స్టార్‌ హోటళ్లు, రిసార్ట్‌లు, క్లబ్‌లు, కన్వె న్షన్‌ సెంటర్లు వేడుకలకు ఆతిథ్యమిచ్చా యి. పలుచోట్ల సినీతారలతో సందడి చేయించారు. దేశ, విదేశాల నుంచి కళాకారులను తీసుకొచ్చి డీజేలు, లైవ్‌ మ్యూజి‌క్‌లతో వేడుకలు నిర్వహించా రు. వినోదంతో పాటు తిన్నోళ్లకు తిన్నంత... తాగినోళ్లకు తాగినంత అనే రీతిలో నిర్వాహకులు ఆఫర్లు ప్రకటించారు.

హోటళ్లు, రిసార్టుల్లో వేడుకలు

జిల్లాలోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నోవాటెల్‌, శంకర్‌పల్లి మండలంలోని ప్రగతి రిసార్ట్స్‌, పర్వేద పరిధిలోని ఫాం ఎక్సోటికా రిసార్ట్స్‌, గ్రీన్‌వాలీ, మొయినాబాద్‌ మండలం కనకమామిడిలోని బ్రౌన్‌టౌన్‌, పోలోరైడింగ్‌ క్లబ్‌, చిలుకూరులోని మృగవని ఏకో రిసార్ట్స్‌లో, ముర్తూజగూడలోని ఈవెన్‌ రిసార్ట్స్‌ న్యూ ఇయర్‌ జోష్‌ జోరందుకుంది. వ్యక్తిగత ఫామ్‌హౌ్‌సలలో వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు కొం దరు ఏర్పాట్లు చేసుకున్నారు. గేటెడ్‌ క మ్యూనిటీల్లో కూడా న్యూఇయర్‌ సం దడి కనిపించింది. గ్రామీణ ప్రాంతాల్లో పొలాల వద్ద వేడుకలు చేసుకునేందుకు యువకులు ప్లాన్ చేసుకున్నారు. కొత్త సంవత్సర వేడుకలను పుసర్కరించుకొని బేకరీలు, స్వీట్‌ హౌస్‌లు ఐట మ్స్‌ సిద్ధం చేశాయి. న్యూ ఇయర్‌ వేడుకలకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పా ట్లు చేశారు. గత ఏడాది అనుభవాల దృష్ట్యా ఈ సారి కొత్త సంవత్సరాన్ని శాంతి భద్రతల నడుమ జరపాలని తగిన భద్రతా చర్యలు చేపట్టారు.

భారీ ఖర్చుతో వేడుకలు..

నూతన సంవత్సర వేడుకలకు సిటీ జనం భారీ ఖర్చు పెట్టారు. వీరిని దృష్టి లో పెట్టుకొని కొన్ని హోటళ్లు, రిసార్ట్‌ల యాజమాన్యాలు ఆర్భాటంగా న్యూ ఇయర్‌ వేడుకలు నిర్వహించాయి. పలు నక్షత్రహోటళ్లు, రిసార్ట్‌ల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నా యి. ఇక్కడ టిక్కెట్‌ ధరలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఓ న్యూ ఇయర్ ఈవెంట్ కార్యక్రమానికి రూ.5,499 నుంచి రూ.1,50,000 లు టికెట్ ధర తీసుకున్నారు. ఓ మ్యూజిక్‌ పార్టీకి టిక్కెట్‌ ధర రూ.2499 నుంచి రూ.1,00,000 నిర్ణయించారు. రిసార్టుల్లో న్యూ ఇయర్‌ ప్యాకేజీలు ఉన్నాయి. ఇక్కడ కూడా రూమ్‌లకు రూ.25వేల వర కు ప్యాకేజీలు పెట్టారు.

Advertisement

Next Story

Most Viewed