రూ.కోటి విలువ చేసే బంగారం పట్టివేత.. ఎక్కడంటే..?

by Nagam Mallesh |
రూ.కోటి విలువ చేసే బంగారం పట్టివేత.. ఎక్కడంటే..?
X

దిశ, శంషాబాద్ : అక్రమంగా తరలిస్తున్న కోటి విలువ చేసే బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఈ బంగారాన్ని తరలిస్తున్నాడు. ఈ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. డిఆర్ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం దుబాయ్ నుండి ఎమిరేట్స్ (EK-528) విమానంలో హైదరాబాద్ వచ్చేందుకు ప్రయాణికుడు శంషాబాద్ విమానాశ్రయంలో దిగాడు. బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్నారని అప్పటికే నిగా పెట్టిన డిఆర్ఐ అధికారులు విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు తనిఖీ నిర్వహిస్తున్నగా సదరు వ్యక్తి వద్దబంగారం ఉన్నట్లు గుర్తించారు. అదుపులోకి తీసుకొని విచారించడంతో ప్రయాణికుడు బంగారాన్ని తాను వేసుకున్న షూలో అదే విధంగా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టి తరలిస్తున్నట్లు గుర్తించారు. అతని వద్ద నుండి 1,00,06,909 విలువ చేసే 1 ఒక కిలో 390 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed