ఫిరంగి నాలా కబ్జా.. హైడ్రాతో మోక్షం కలిగేనా..?

by Nagam Mallesh |
ఫిరంగి నాలా కబ్జా.. హైడ్రాతో మోక్షం కలిగేనా..?
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : తాగు, సాగు నీరు కోసం నిజాం పాలకులు చెరువులు, కాలువులు, నాలాను తవ్వించారు. అందులో భాగంగానే ఫిరంగి నాలాను నిర్మించారు. ఈ నాలా సుమారు 90కీ.మీ మేర నాలుగు దిక్కులున్న చెరువులను కలుపుతూ సాగు, తాగునీరుకు ఉపయోగించారు. రంగారెడ్డి జిల్లాలోని రైతులకు, ప్రజలకు జీవనాధారమేనని చెప్పకతప్పదు. జిల్లాలో ఏలాంటి సాగునీటి ప్రాజెక్టులు లేకపోయిన ఆనాటి రైతులకు ఫిరంగి నాలా వరంలాగా ఉండేందని మేదావులు, పర్యావరణ మేదావులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి ఫిరంగి నాలా నేడు పూర్తిగా ధ్వంసమైయింది. చాలామంది ఈ కాలువను కబ్జా చేస్తున్నారు. దాంతో ఇప్పుడు హైడ్రా ఫిరంగి నాలాపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

కబ్జాలతోనే నగరంలోకి నీరు...


ఫిరంగి నాలా సక్రమంగా, ధ్వంసం కాకుండా ఉన్నప్పుడు భారీ వర్షాలు వచ్చినా ఇండ్లల్లోకి నీళ్లు వచ్చిన సంఘటనలు లేవు. నేడు చిన్న వర్షం వస్తే చాలు రోడ్లున్ని జలమయం, ఇండ్లల్లోకి నీళ్లు చేరడం ఆలవాటైయింది. దీంతో అనేక మంది వాహనాదారులు, ఇంటి యజమాన్యులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. వర్షాలు వచ్చినప్పుడు దిక్కు తోచని స్థితిలో ఉంటున్నారు. ఇదంతంటికి ప్రధాన కారణం ఫిరంగి నాలా పూర్తిగి విధ్వంసం చేయడంతోనే నగరానికి నీటి ముప్పుగా మారిపోయింది. చెరువులు నిండి అలుగు పోస్తూ ఫిరంగి నాలా నుంచి మరోక చెరువులోకి సక్రమంగా పోవడంతో ఏలాంటి విపత్తులకు అవకాశం లేదు. కానీ ఆ నాలాల గుండా నీరు వెళ్లే మార్గానికి పూర్తిగా నిర్మణాలతో మూసివేయడంతోనే నీరు పట్టణ ప్రాంతాలకు చెరుకుంటుంది. ఫిరంగి నాలా దాదాపు 70శాతం కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. ఈ చెరువుల పక్కనే రియల్ ఏస్టేట్​ వ్యాపారులు భారీ స్ధాయిలో నిర్మాణాలు చేపట్టి బఫర్​జోన్​, ఎఫ్​టీఎల్ పరిధిలను పూర్తిగా మట్టితో మూసేయడంతోనే విపత్తులు సంభవిస్తున్నాయి. హిమాయత్‌ సాగర్‌ నుంచి మొదలుపెడితే ఎర్రకుంట, పహాడిషరీఫ్‌, కొత్తపేట, వెంకటాపూర్‌, నాదర్‌గుల్‌లతోపాటు అనేకచోట్ల కాలువ గండి పడిపోవటంతోపాటు పెద్ద ఎత్తున కబ్జాకు గురయింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం వృద్ధికావటంతో కాలువ ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి. తుర్కయాంజల్‌లోని కొత్తచెరువు, ఇబ్రహీంపట్నం చెరువు, నాదర్‌గుల్‌లోని మన్సూర్‌ఖాన్‌ చెరువు, ఇంజాపూర్‌లోని ఇంజాపూర్‌ చెరువు, హయత్‌నగర్‌ చెరువులో అనేకచోట్ల అమ్మకాలు చేయటానికి వీలులేని ఎన్నో ఇనామ్‌ పట్టా భూములు నేడు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల పాలయ్యాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం నిర్మించిన ఈ కాలువ పరివాహం మొత్తం ఎండిపోయింది. ఎన్నోచోట్ల కాలువను పూడ్చి భారీ నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

హైడ్రాతో విముక్తి కలిగేనా..!

రంగారెడ్డి జిల్లాకు జీవనాధారమైన ఫిరంగి కాల్వాపైన హైడ్రా దృష్టి పెట్టాలని సామాన్య ప్రజలు, రైతులు కోరుతున్నారు. ఫిరంగి కాల్వ కబ్జాలకు గురికావడంతో చెరువుల్లో నిండు కుండాల ఉండాల్సిన నీళ్లు విధుల పాలైతుందని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడిక్కడ ఫిరంగి నాలాను కబ్జాలు చేసి నిర్మాణాలు చేపట్టడంతో నీటి ప్రవాహాం అధికంగా వచ్చినప్పుడు ఇండ్లల్లోకి నీళ్లు చేరి సామాన్యులు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు ఫిరంగి నాలాను పునరుద్దరణ చేపట్టి ప్రజలను ముంపు నుంచి కాపాడుకోవచ్చునని పర్యవరణ పరీరక్షణ సమితి సభ్యులు వివరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed