ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు..

by Kalyani |
ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు..
X

దిశ, యాచారం: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం రైతు దినోత్సవం జరిపారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా బీఅర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పరిగూడ గ్రామంలో రైతు వేదికలో నిర్వహించిన రైతు ఉత్సవాలల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.. రైతులు ప్రభుత్వం ద్వారా పొందిన లబ్ది గురించి వివరించారు. రైతుల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు.

రైతులకు గతంలోని ప్రభుత్వాలు ఎన్నడూ చేయని విధంగా, దేశంలో ఏ ఇతర రాష్ట్రాలలో లేని విధంగా పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటాచారి, రైతు బంధు జిల్లా కోఆర్డినేటర్ వంగేటి లక్ష్మా రెడ్డి, రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకట రమణ రెడ్డి, డిసిసిబి వైస్ చైర్మన్ సత్తయ్య, సర్పంచ్ బూడిద రాం రెడ్డి , ఏఈఏ సత్యనారాయణ, ఎంపీపీలు కృపేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు...

Advertisement

Next Story

Most Viewed