- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఎన్నాళ్ళకు పుర్తయ్యేనో..
దిశ, రాజేంద్రనగర్ : ఏదైనా ప్రారంభిస్తే నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని పట్టుదల అందరిలో ఉంటుండి. కానీ ఘనత వహించిన జీహెచ్ఎంసీలో మాత్రం అది కానరావడం లేదు. క్రీడాకారులను తీర్చిదిద్దడానికి కోట్లు ఖర్చు చేస్తామనే ప్రభుత్వం ఏళ్ళుగా సాగుతున్న క్రీడా మైదానం పనులను మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వ్యవహరిస్తుంది.
మరెన్నడు పూర్తికానున్నదో అంటూ స్థానిక క్రీడాకారులు ఎదురు చూస్తున్నారు. నాటి కాంగ్రెస్ హయాం 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మైలర్ దేవ్ పల్లి డివిజన్ స్పోర్ట్ కాంప్లెక్స్ భవనానికి శంకుస్థాపన చేసి మూడేళ్లలో క్రీడా మైదానాన్ని అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఇండోర్ స్టేడియం నిర్మాణం కోసం 20కోట్ల నిధులను మంజూరు చేసారు. క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేశారు. నెలలు గడుస్తున్నాయి, సంవత్సారాలు దొర్లి పోతున్నాయి, 15 సంవత్సరాలు పూర్తి కావచ్చాయి. కాని నేటికీ పనులు మాత్రం ఓ అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతూనే ఉన్నాయి.
జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ అధికారి వివరణ..
తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ఇండోర్ స్టేడియం పనుల్లో ఒకింత కోర్టు కేసుల వల్ల జాప్యం జరిగింది. ప్రస్తుతానికి ఇండోర్ స్టేడియం కబడ్డీ, వాలిబాల్, కోకో, టెన్నిస్ లాంటి ఆటలు కొనసాగడానికి అవసరమైన అన్ని చర్యలను 3 ఏళ్ల క్రితమే పూర్తిచేశాం. కానీ కోర్టులో కేసు పెండింగ్ వల్ల అందుబాటులోకి తీసుకురాలేదు. మిగిలిన అన్ని పనులు పూర్తి చేసి ఫిబ్రవరిలో క్రీడాకారులకు అందిస్తామన్నారు. స్కేటింగ్ గ్రౌండ్ అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. 3 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న నేటికి అవసరమైన అడుగులు పడలేదు. దీంతో ఎల్.బీ స్టేడియం వెళ్లి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. వెళ్లి రావడానికి దూరాభారంతో ఇబ్బందిగ మారింది. రెండు సార్లు స్కేటింగ్ లో గోల్డ్ మెడల్ సంపాదించాను.
స్థానికుల అభిప్రాయం..
క్రీడా ప్రాంగణం అందుబాటులోకి ఏంతో మంది క్రీడాకారులు తయారు అయ్యేవారు. ఇండోర్ స్టేడియం నిర్మాణానికి 15 ఏళ్ల సమయం తీసుకోవడంతో ఔస్తాహిక క్రీడాకారులు నిరుస్తాహానికి లోనవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు అధికారులు చర్యలు తీసుకుని వెంటనే పూర్తి చేయాలి.