కబ్జా కోరల్లో తాగునీటి బావి..

by Nagam Mallesh |
కబ్జా కోరల్లో తాగునీటి బావి..
X

దిశ, ఇబ్రహీంపట్నం : ఆరుట్ల గ్రామంలో కబ్జాకు గురై కనుమరుగై పోతున్న త్రాగు నీటి గొట్టంబావిని రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబ్జా నుండి కాపాడి చుట్టూ కంచె ఏర్పాటు చేయాలి అని ఆరుట్ల గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని బండలేమూర్ వెళ్లే దారిలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కబ్జా చేసిన ఆరుట్ల గ్రామం మొత్తానికి త్రాగు నీరు అందించిన గొట్టం బావిని కబ్జా కోరల్లో నుండి రక్షించాలని అంటున్నారు. గ్రామానికి మంచినీరు అందించే ఈ బావిని మళ్లీ పునరుద్ధరించి మిషన్ భగీరథ తాగునీరు రానప్పుడు ఈ బావి నీటిని వినియోగించే విధంగా అందుబాటులోకి తేవాలని గ్రామస్తులు కోరుతున్నారు. దాదాపు త్రాగునీటి గొట్టంబావి నిర్మించి 30 సంవత్సరాలు కావస్తుంది కాని ఈనాటి పాలకుల నిర్లక్ష్యం వల్ల గత 10 సంవత్సరాలుగా పాలకులు పట్టించు కొక పోవటంతో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు గ్రామంలోని పెద్దలతో చేతులు కలిపి తాగునీటి బావి ప్రక్కన ఉన్న భూమిని కొనుగోలు చేసి గొట్టం బావి ఉన్న స్థలాన్ని కూడావదిలి పెట్టకుండా భూమి చుట్టూ కడీలు వేసి కబ్జా చేయడం జరిగింది. చాలాసార్లు గ్రామస్తులు అధికారుల దృష్టికి గ్రామపంచాయతీ పాలకుల దృష్టికి తీసుకువెళ్లిన ఇప్పటివరకు త్రాగునీటి బావిని కాపాడే ప్రయత్నం చేయలేదు.

గొట్టంబావిని కబ్జా నుంచి కాపాడాలి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాధగోని జంగయ్య గౌడ్

ఆనాటి నాయకులు ఆరుట్ల గ్రామ ప్రజల దాహం తీర్చటానికి ప్రభుత్వంతో పోరాడి మూరుసోల కుంటలో స్థలం గుర్తించి గొట్టం బావి నిర్మించి గ్రామప్రజలకు త్రాగునీరు అందిస్తే ఈనాటి నాయకులు, పాలకులు రియల్ ఎస్టేట్ పారస్తులతో చేతులు కలిపి త్రాగునీటి బావి కబ్జాకు గురి అయిన పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి కబ్జాకు గురైన త్రాగునీటి గొట్టం బావిని కాపాడి చుట్టూ కంచె వేసి ఆరుట్ల గ్రామ ప్రజలకు బావి నుండి నీటి సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలి అన్నారు. లేని పక్షంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం అని మేము అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులమైన ప్రజా సమస్యలు అధికారుల దృష్టి కి తీసుకు పోవడమే మాలక్ష్యం ప్రజల కోసమే పనిచేస్తాం అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ మాధగోని జంగయ్య గౌడ్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed