డీఎస్సీ–2008 అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలనకు నిర్ణయం

by Sridhar Babu |
డీఎస్సీ–2008 అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలనకు నిర్ణయం
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : డీఎస్సీ–2008 అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా ఎట్టకేలకు కాంగ్రెస్​ ప్రభుత్వం 2008 డీఎస్సీ అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లా విద్యాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం స్కూల్​ ఎడ్యూకేషన్​ వెబ్​సైట్​లో ఎంపికైన అభ్యర్థుల వివరాలు పొందుపరిచారు. అందులోనున్న అభ్యర్థులు మాత్రమే ఈనెల 27వ తేదీ నుంచి అక్టోబర్​ 5వ తేదీ వరకు ఒరిజనల్​ సర్టిఫికెట్లతో హాజరు కావాలని జిల్లా విద్యాశాఖాధికారి సుశీందర్​ రావు తెలిపారు. హాజరయ్యే అభ్యర్థులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్​ కార్యాలయంలోని జిల్లా విద్యాశాఖాధికారిని సంప్రదించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed