- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA : రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
దిశ, తాండూరు : రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని డీసీఎంఎస్ గోదాం ఆవరణలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైస్‌మిల్లర్లతో కుమ్మక్కై అడ్డగోలుగా కోతలు విధించి రైతులను నిలువునా దోచుకుందని ఆరోపించారు. ధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.
ఏ గ్రేడ్ ధ్యానానికి రూ.2060, బీ గ్రేడ్ రూ.2040 చొప్పున మద్దతు ధర అందిస్తుందన్నారు. రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. దళారులకు రైతులు ధాన్యం విక్రయించవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పూర్తిగా అండగా ఉంటుందని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి కోతలు ఉండవని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారా సింగ్, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, నాయకులు, డీసీఎంఎస్ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.