- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మీవల్లనే చనిపోయాడు..’ పీపుల్స్ ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన
దిశ, యాచారం: వైద్యం వికటించి నిండు ప్రాణం గాలిలో కలిసిపోయిందని ఆరోపిస్తూ మాల్‌లోని పీపుల్స్ ఆసుపత్రి ఎదుట బాధితుని కుటుంబీకుల ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. కడ్తాల్ మండలం సరికొండ గ్రామానికి చెందిన గౌర పాపయ్య (55) గుర్తుతెలియని క్రిమి సంహారక మందు తాగి అకస్మారక స్థితికి చేరుకోవడంతో యాచారం మండలం మాల్, పట్టణ కేంద్రంలోని పీపుల్స్ ఆస్పత్రిలో చేర్పించారు. బాధితుడికి 11 రోజులుగా వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. సోమవారం రాత్రి పరిస్థితి విషమించి గౌర పాపయ్య మృతి చెందాడు. చికిత్సను అందిస్తున్న వైద్యులు ఏమి కాదని త్వరలోనే కోలుకుంటాడని చెప్పారని బాధితుని కుటుంబీకులు వాపోయారు. నామమాత్రపు చికిత్సను అందించడంతోనే వైద్యం వికటించి పాపయ్య మృతిచెందాడని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఆందోళన చేపట్టారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి మృతుడి కుటుంబ సభ్యులను సమదాయించారు.