మామిడి పండ్లకు కేరాఫ్ పూడూరు

by Anjali |
మామిడి పండ్లకు కేరాఫ్ పూడూరు
X

దిశ, పరిగి: నోరూరించే మామిడి పండ్లకు కేరాఫ్​ పూడూరు మండలంగా చెప్పుకోవచ్చు. మామిడి పండ్లు అంటే ఇష్ట పడని వారు ఉండరు. పూడూరు, మన్నెగూడ మామిడి పండ్లంటే మహా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇక్కడ వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉండడం ఇక్కడ పండ్లుగా తయారు చేసేందుకు ఎలాంటి కెమికల్స్​ వాడకపోవడం ప్రత్యేకత. చెట్టుపైనే పండ్లు అయ్యేంత కు వరకు జాగ్రత్తగా కాపాడుకుంటా రు. పాత పద్ధతిలో పండ్లను మాటు వేస్తారు కాబట్టి ఎంతో రుచికరంగా ఉంటాయి. ముఖ్యంగా తోటల ముందే పండ్లు దుకాణాలను ఏర్పాటు చేసుకుంటారు. వినియోగదారుల కోరిక మేరకు చెట్ల నుంచి తెంపి అప్పటికప్పుడు కూడా కోసి ఇవ్వడం ఇక్కడ మరో ప్రత్యేకత.

పండ్లలో రకాలు

పూడూరు మండల వ్యాప్తంగా పూడూరు, మన్నెగూడ, అజయ్​ బాగ్​, ఎన్కెపల్లి, ఎన్కెపల్లి, కండ్లపల్లి, మంచన్​‌పల్లి, చిట్టెంపల్లి, మిర్జాపూర్​ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మామిడి పండ్ల తోటలున్నాయి. ముఖ్యంగా ఈ తోటల్లో దసేరి, బేని షాన్, లంగుడా, తోతపరి, రసాలు, కేసరి, హిమాయత్ తదితర రకాల పండ్లకు ఇక్కడ బలే గిరాకి ఉంటుంది. ఒక్కో రంకం పండ్లు కిలోకు రూ. 80 నుంచి రూ. 250 వరకు ధర పలుకుతోంది.

మన్నెగూడ నుంచి మస్కట్​

పరిగి నియోజవకర్గంలోని పూడూరు, మన్నెగూడ మామిడి పండ్లు చాలా డిమాండ్​ ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్నాటక రాష్ర్టం ప్రజలు కూడా మామిడి పండ్లను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. మన్నెగూడ నుంచి మస్కట్​ వరకు ఈ పండ్లను రుచి చూడని వాళ్లు ఉండరు. ఇటు హైవే రోడ్డుపై వెళ్లే ప్రతి వాహన దారుడిని నోరూరించేలా ఈ పండ్లను దుకాణాలు ఏర్పాటు చేస్తారు. పరిగి వికారాబాద్​, కోడండగల్​ తదితర ప్రాంతాల ప్రజలు ఎక్కవ సంఖ్యలో కొనుగోలు చేస్తుంటారు.

Advertisement

Next Story