- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఊరికి ఒకటే బస్సు
దిశ, దోమ : విద్యార్థులకు బస్ కష్టాలు తప్పడం లేదు. సరిపడా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో విద్యార్థులు నానాకష్టాలు పడుతున్నారు. ఉన్న అరాకొర బస్సులూ సమయానికి రావడం లేదు. దీంతో వచ్చిన బస్సులోనే తొందరగా వెళ్లిపోవాలనే ఆత్రుతతో విద్యార్థులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. బుధవారం పరిగి డిపోకు చెందిన బస్సు గూడూర్, దొంగ ఎంకేపల్లి, ముజేహిద్పూర్ మీదుగా అనంతసాగర్ కు వెళ్తుంది.
బస్సు మిస్ అయితే ప్రైవేట్ వాహనాల్లో వెళ్లాల్సి వస్తుందని, ఒక్కటే బస్సు ఉండడంతో కొంతమంది విద్యార్థులు ఫుట్ బోర్డు పైవేలాడుతూ, మరికొంతమంది విద్యార్థులు బస్సు టాపు పై కూర్చుని ప్రయాణం చేస్తున్నారు. ముందే రోడ్డులు అంతంత మాత్రంగా ఉండడంతో, అరకొర బస్సులతో విద్యార్థుల ప్రాణాలతో ఆర్టీసీ అధికారులు చెలగాటం ఆడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉదయం, సాయంత్రం సమయాలలోఎక్కువ బస్సులు నడపాలని విద్యార్థులు కోరుతున్నారు.