ప్రభుత్వ స్కూళ్లకు అధునాతన హంగులు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

by Sridhar Babu |   ( Updated:2023-01-14 13:28:04.0  )
ప్రభుత్వ స్కూళ్లకు అధునాతన హంగులు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, బడంగ్​ పేట్​ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 వేల పై చిలుకు పాఠశాలల్లో ముఖ్యమంత్రి కేసీఆర్​ సహకారంతో మొదటి విడతలో 9123 పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖా మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఒక్క మహేశ్వరం నియోజకవర్గంలో ప్రత్యేకంగా మన ఊరు మన బడి లో మొదటి విడతలో ఎంపిక కానీ పాఠశాలలో ప్రత్యేక పనులకు 9 కోట్ల 13 లక్షల 62 వేల 800 రూపాయల నిధులు విడుదలైనట్లు చెప్పారు. అందులో 87 పాఠశాలల్లో పెయింటింగ్ కు 2 కోట్ల 87 లక్షల 19 వేల 200 రూపాయలు, 83 పాఠశాలల్లో మైనర్ మరమ్మతులకు 2 కోట్ల 45 లక్షల 65 వేల 200 రూపాయలు, టాయిలెట్లకు 64 పాఠశాలల్లో 99 లక్షల 58 వేల 900 నిధులు, విద్యుత్, లైట్లకు 92 పాఠశాలల్లో ఒక కోటి 27 లక్షల 28 వేల 100 రూపాయలు, నల్లాల కనెక్షన్స్ కొరకు ఒక పాఠశాలలో 85 వేల నిధులు, 4 పాఠశాలలో అదనపు తరగతి గదుల కోసం కోటి 53 లక్షల 6 వేల పై చిలుకు నిధులు మంజూరు అయ్యాయని, త్వరలోనే పనులు పూర్తయ్యేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Next Story