పరిగిలో అడిషనల్ డీజీ విచారణ..

by Sumithra |
పరిగిలో అడిషనల్ డీజీ విచారణ..
X

దిశ, పరిగి : వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో కలెక్టర్, ఇతర అధికారుల పై దాడిని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు పరిగి పోలీస్ స్టేషన్ కు అడిషనల్ డీజీ‌ మహేష్ భగవథ్, ఐజీ సత్యనారాయణ, వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రవిందర్ రెడ్డి, పలువురు డీఎస్పీలు చేరుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏవన్ గా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరో 20 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే.

ఈ దాడిలో అసలు సూత్రధారులు ఎవరు ఉన్నారు అన్న కోణంలో దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ప్రత్యేక అధికారుల పై పక్కాగా ప్లాన్ చేసి దాడి చేసినట్లు ఆధారాలు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో అసలు సూత్ర దారులు ఎవరు ఉన్నారన్న విషయం పరిగి పోలీస్ స్టేషన్లో సుమారు రెండు గంటలుగా విచారణ ఇంకా కొనసాగుతోంది.

Advertisement

Next Story