- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
పెళ్లికి నిరాకరించిందని యువతిపై పెట్రోల్ తో దాడి..!
దిశ ప్రతినిధి, వికారాబాద్ : నిశ్చితార్థం అయ్యాక పెళ్లికి నిరాకరించడంతో యువతి, ఆమె తల్లిపై యువకుడు పెట్రోల్ తో దాడి చేసిన ఘటన ధారూర్ మండలపరిధిలో చోటుచేసుకుంది. ధారూర్ పోలీసులు తెలిపిన వివరాల ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ధారూర్ మండలం, గడ్డమీద గంగారం గ్రామానికి చెందిన గొల్ల రాకేష్ (27) అదే గ్రామానికి చెందిన ఓ యువతి, ఆమె తల్లిపై దాడి చేసినట్టు వారు ఫిర్యాదు ఇచ్చారు.
యువకునికి ఇటీవలె యువతితో నిశ్చితార్థం జరిగింది. అయితే యువతి వివాహాన్ని తిరస్కరించడంలో ఆమె పై దాడికి దిగాడు. చివరిసారిగా అడుగుతున్నాను నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకోవా అని బెదిరించడంతో యువతి ఆమె తల్లి ఇద్దరు తిరస్కరించారు. దాంతో ఆగ్రహానికి గురైన రాకేష్ ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం, బాటిల్లో ఉన్న పెట్రోల్ తీసి యువతిపై అడ్డు వచ్చిన తల్లిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించే ప్రయత్నం చేశాడు. అంతలోపే అలర్ట్ అయిన యువతి తల్లి రాకేష్ ని బయటకు తోసి చుట్టుపక్కల వారిని పిలిచింది.
విషయం గ్రహించిన నిందితుడు రాకేష్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. యువతి, ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాకేష్ ని అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్ కు తరలించారు. నిశ్చితార్థం చేసినప్పటి నుంచి యువకుడి ప్రవర్తన తేడా కనిపించడంతో పెళ్లి సంబంధం రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది.