Kishan Reddy: మజ్లిస్ కోసమే పోలీసులు పని చేస్తున్నారు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

by Shiva |   ( Updated:2024-11-15 07:24:13.0  )
Kishan Reddy: మజ్లిస్ కోసమే పోలీసులు పని చేస్తున్నారు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో హిందూ ఆలయాలపై వరుసగా జరుగుతోన్న దాడుల పట్ల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) మరోసారి ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌ (Hyderabad)లోని హరితా ప్లాజా (Haritha Plaza)లో మీడియాతో మాట్లాడుతూ.. ఆలయాలపై యథేచ్ఛగా దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దాడి జరిగిందని కంప్లైంట్ ఇచ్చిన హిందువులపైనే తిరిగి కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను గాలికొదిలి సీఎం రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర (Maharastra)లో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

అసదుద్దీన్ (Asaduddin) కోసం మాత్రమే రేవంత్ (Revanth) పోలీసులు పని చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యంగా హిందువులను రెచ్చగొట్టే విధంగా హైదరాబాద్‌‌ (Hyderabad)లో దాడులు కొనసాగుతున్నాయని అన్నారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోందని ధ్వజమెత్తారు. కలెక్టర్‌పై దాడులు, రైతులపై కేసులా.. తెలంగాణ ప్రజలు కురుకుంటుందని ఆక్షేపించారు. కేసీఆర్ (KCR), రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇద్దరూ తెలంగాణ బతుకులను నడిరోడ్డుపై వదిలేశారని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Advertisement

Next Story