- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
రాజన్న ఆలయంలో కార్తీక శోభ..పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
దిశ, వేములవాడ: దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీకమాస వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల నుండి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అనంతరం ఆలయ ముందు భాగంలో మహిళా భక్తులు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగిస్తూ రాజన్నపై వారికి ఉన్న భక్తి భావాన్ని ప్రదర్శిస్తున్నారు.
దీంతో ఆలయ ప్రాంగణమంతా దీపాల వెలుగుల్లో మెరిసిపోతుంది. మరోవైపు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో అర్చకులు పలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రదోషకాలం పూజ అనంతరం రాత్రి 7:30గంటలకు జ్వాలా తోరణం తో పాటు నిషి పూజ అనంతరం రాత్రి 10:15 గంటలకు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాపూజ, తదుపరి తీర్థ ప్రసాద వితరణ జరగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.