- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Oxford: ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో జమ్ముకశ్మీర్ గురించి చర్చ
దిశ, నేషనల్ బ్యూరో: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ(Oxford University)లో జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తి గురించి నిర్వహించిన చర్చావేదికలో వివాదం చెలరేగింది. శుక్రవారం యూనివర్సిటీలో డిబేటింగ్ సొసైటీ నిర్వహించిన చర్చలో జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir)కు స్వతంత్ర ప్రతిపత్తి గురించి కమిటీ సభ్యులు మాట్లాడటంతో భారత విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కశ్మీర్ గురించి మాట్లాడిన ముజ్జామ్మిల్ ఆయూబ్ ఠాకూర్, జఫార్‌ఖాన్‌లకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని(terror links) భారత విద్యార్థులు విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా ఆయూబ్ ఠాకూర్ తరచూ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్దఎత్తున నిరసనలు తెలిపారు. ‘ఆక్స్‌ఫర్డ్ యూనియన్ ఎల్లప్పుడూ ఉగ్రవాదుల వైపే ఉంటుంది’ అని భారతీయ విద్యార్థులు ఆరోపించారు. జమ్ముకశ్మీర్ అప్పుడు..ఇప్పుడు..ఎప్పుడూ భారత్‌లోనే ఉంటుందని పేర్కొన్నారు.
మాత్రే కిడ్నాప్ వెనుక ఆయూబ్ ఠాకూర్..!
ఇకపోతే, 1984లో లండన్‌లో భారత దౌత్యవేత్త రవీంద్ర మాత్రే కిడ్నాప్, హత్య వెనక జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఉందని స్టూడెంట్స్ ఆరోపించారు. ముజ్జామ్మిల్ ఆయూబ్ ఠాకూర్ ‘‘వరల్డ్ కశ్మీర్ ఫ్రీడమ్ మూవ్‌మెంట్’’ అనే సంస్థను స్థాపించారు. ఆయన తండ్రితో కలిసి సంయుక్తంగా ‘‘మెర్సీ యూనివర్సల్’’ అనే సంస్థను స్థాపించాడు. కాగా ఈ రెండింటికి ఉగ్ర సంస్థలతో సంబంధం ఉందనే ఆరోపణలపై అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ(FBI)తో పాటు యూకేకు చెందిన నిఘా సంస్థలు విచారణ జరిపినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.