CV Anand: మా అధికారులపై విపరీతమైన ఒత్తిడి.. ఆక్రమణలపై సీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |
CV Anand: మా అధికారులపై విపరీతమైన ఒత్తిడి.. ఆక్రమణలపై సీపీ సీవీ ఆనంద్  కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో సైకిల్ ట్రాక్ లు, ఫుట్ పాత్ ల (foot path encroachments) ఆక్రమణలపై సిటీ సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand) కీలక వ్యాఖ్యలు చేశారు. సైకిల్ ట్రాక్ లు, ఫుట్ పాత్ ల ఆక్రమణలు మాఫీయా తరహా చర్య అన్నారు. దీని వల్ల ట్రాఫిక్ పై (Hyderabad traffic) ప్రతికూల ప్రభావం పడుతోందని అందువల్ల ఆపరేషన్ రోప్ ను సీరియస్ గా చేపట్టాలని తాను అధికారులకు సూచించానన్నారు. ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు తమ వస్తువులను అమ్ముకుని జీవనం గడిపేందుకు సైకిల్ ట్రాక్ లు ఫుట్ పాత్ లను నిర్దాక్షిణ్యంగా ఆక్రమించుకుంటున్నారని ఇటువంటి వాటిలో పేదరికం, జీవనోపాధి అంశాలను తీసుకురావొద్దని కోరారు. వీటిని క్లియర్ చేసే సమయంలో మా అధికారులు ప్రతి రోజు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అందువల్ల అధికారులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎక్స్ వేదికగా ఓ నెటిజన్ చేసిన పోస్టుకు చిలకలగూడ ట్రాఫిక్ పీఎస్ స్పందనపై సీవీ ఆనంద్ పై విధంగా స్పందించారు. కాగా ఆలుగడ్డ భావి నుంచి మెట్టుగూడ వెళ్లే మార్గంలో ఎడమవైపున కూరగాయల వ్యాపారులు, నర్సరీలు రోడ్డును ఆక్రమించుకుంటున్నారని వీటిపై చర్యలు తీసుకోవాలని ఓ నెటిజన్ చేసిన పోస్టుకు చిలకలగూడ ట్రాఫిక్ పీఎస్ స్పందించింది. తాము క్రమం తప్పకుండా ఆపరేషన్ రోప్ నిర్వహిస్తున్నామని, నిబంధనలకు విరుద్ధమైన వాటిని తొలగించి చలాన్లు వేస్తున్నామని చెప్పారు. ట్రాఫిక్ పోలీసుల చర్యను సీవీ ఆనంద్ ప్రశంసించారు. మీ పనిని కొనసాగించాలని మరియు ఆ ప్రాంతాన్ని క్లీన్ గా ఉంచేందుకు అవసరమైన చోట జీహెచ్ఎంసీ సహాయం తీసుకోవాలని సూచించారు.

ఆపరేషన్ రోప్ ను తొలుత చార్మినార్ ప్రాంతంలో ప్రారంభించాలని, అక్కడ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజయం సాధిస్తారా లేదో చూడాలనిఆ తర్వాత మరో ప్రాంతంలో విస్తరించాలని ఓ నెటిజన్ చేసిన కామెంట్ కు సీవీ ఆనంద్ సెటైరికల్ రిప్లై ఇచ్చారు. 'ఇదిగో! ప్రతి దానిలో 'ఆ కోణాన్ని' తీసుకురండి అంటూ స్మైలీ ఎమోజీతో రిప్లే ఇచ్చారు. అలాగే ఇతర నెటిజన్ల కామెంట్లపై స్పందిస్తూ.. మాకు చాలా పరిమిత సిబ్బంది, వనరులు, క్రేన్లు ఉన్నాయని అయినప్పటికీ మేము మా వంతు కృషి చేస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed