- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
కరిచిన పాముకు నరకం చూపించిన బాధితుడు
దిశ, కొత్తగూడెం : సహజంగా పామును చూడగానే ఎవరైనా భయపడతారు. కానీ కరిచిన పామును చంపి తనతో పాటు ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స చేయించుకుంటున్న ఘటన కొత్తగూడెంలో చోటు చేసుకుంది. కొత్తగూడెం పట్టణానికి చెందిన రిటైర్డ్ కార్మికుడు జంగా ఓదెలు పెనుబల్లి సమీపంలో తన పొలంలో కూరగాయలు పండిస్తున్నాడు. పొలం పనులు చేసుకుంటున్న ఓదెలును అత్యంత విషపూరితమైన రక్తపింజర పాము కరిచింది. వెంటనే అప్రమత్తమైన ఓదెలు పాము వెంట పడ్డాడు.
పక్కనే ఉన్న కర్ర తీసుకొని దాన్ని చంపేశాడు. పాలిథిన్ కవర్లో పామును వేసుకొని టు వీలర్ పై నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉన్న తన ఇంటికి వచ్చి సింగరేణి ఆసుపత్రి పుస్తకాన్ని తీసుకొని నేరుగా ఆసుపత్రిలోని క్యాజువాలిటీ విభాగానికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నాడు. చనిపోయిన పాముని వెంట తీసుకొని ఆస్పత్రికి రావడంతో అక్కడున్న సిబ్బంది, వైద్యం కోసం వచ్చిన కార్మికులు వారి కుటుంబాలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఓదేలు ధైర్యసాహసాలకి పలువురు ఆయన్ని అభినందించారు. సింగరేణి వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.