- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
APCC: మోడీ పాలన అంత అసమర్థమా?.. కేంద్రమంత్రులకు వైఎస్ షర్మిల సంచలన లేఖ
దిశ, వెబ్ డెస్క్: పెన్షనర్లకు అనుకూలంగా సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇకనైనా పాటించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు(AP Congress President) వైఎస్ షర్మిల(YS Sharmila) కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman), కార్మిక శాఖమంత్రి మన్సూక్ మాండవీయ(Mansook Mandaviya)లకు లేఖ రాశారు. ఈ లేఖలో.. భారత సుప్రీంకోర్టు(Supreme Court of India) నవంబర్ 2022లో ఈపీఎస్(EPS) 95 పెన్షనర్‌లకు అనుకూలంగా తీర్పునిచ్చిందని, కానీ రెండు సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటికీ దీనిపై ఎటువంటి చర్య తీసుకోలేదని తెలిపారు. దీని వలన వేలాది కుటుంబాలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఈ ఆలస్యం పేలవంగా ఉన్న మీ పాలనను ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించారు.
అలాగే ఈపీఎఫ్ఓ(EPFO) ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా పరిగణించబడే క్లయింట్ బేస్ సంస్థ అని అన్నారు. ఇక 1990వ దశకంలో ప్రవేశపెట్టిన పథకం కాలక్రమేణా నిర్వీర్యమైపోతోందని, పెన్షనర్లు(Pensioners) సరిపడా పింఛన్లు(Pensions) రాక బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఈ సంస్థ పదవీ విరమణ పొందిన వారి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి, వారికి బకాయిలు పెట్టిందని, ఏడాది కాలంగా పింఛన్లు వారికి అందలేదని స్పష్టం చేశారు. అంతేగాక ఈపీఎఫ్ఓ సంస్థ సీనియర్ సిటిజన్ల(Senior Citizens) సంక్షేమాన్ని విస్మరించిందని, ఈ సమస్యను పరిష్కరించడంలో మోడీ పాలన(Modi Regime) అంత అసమర్థమా? దీనికి ఎవరు జవాబుదారీ? అని ప్రశ్నించారు. ఇక ఇందులో తక్షణ జోక్యం చేసుకొని వారి సమస్యలు పరిష్కరించాలని నిర్మలా సీతారామన్, మన్సుఖ్ మాండవీయాలను వైఎస్ షర్మిల లేఖ ద్వారా విన్నవించారు.