Tatto: అక్కడ టాటూలు వేయించుకునేవారికి షాకింగ్ న్యూస్.. ఆ ప్రాణాంతక వ్యాధి కన్ఫర్మ్?

by Y.Nagarani |   ( Updated:2024-11-15 12:02:06.0  )
Tatto: అక్కడ టాటూలు వేయించుకునేవారికి షాకింగ్ న్యూస్.. ఆ ప్రాణాంతక వ్యాధి కన్ఫర్మ్?
X

దిశ, వెబ్ డెస్క్: టాటూ (Tattoo).. ఈ పేరు వినగానే.. బాహుబలి సినిమాలోని పచ్చబొట్టేసిన.. పిల్లగాడా నీతో.. సాంగ్ గుర్తొస్తుందా ? ఆగండాగండి. ఇప్పుడు చెప్పే విషయం తెలిస్తే.. ఆట- పాట ఏం ఉండవు. మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. టాటూలు వేయించుకున్న మహిళల్లో 68 మందికి హెచ్ఐవీ (HIV) నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు, చేయించుకున్న మహిళలే చెప్పారు. తాజాగా ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో 68 మంది మహిళలకు హెచ్ఐవీ నిర్థారణ అయింది. ఘజియాబాద్ జిల్లాలోని (Ghaziabad District) మహిళా ఆస్పత్రిలో ప్రినేటల్ చెకప్ లు, కౌన్సెలింగ్ తర్వాత ఈ విషయం వెల్లడైంది. పరీక్షలు చేయించుకున్న మహిళల్లో చాలామందికి టాటూలు ఉన్నట్లు గుర్తించారు.

వారిలో 20 మంది మహిళలు తాము రోడ్ సైడ్ టాటూలు వేయించుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ సోకినట్లు చెప్పారు. ఒకరికి హెచ్ఐవీ ఉంటే.. ఆమెకు టాటూ వేసిన సూదితోనే అందరికీ వేయడంతో హెచ్ఐవీ సోకి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నెటిజన్లలో భిన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతుండగా.. భారీగా మహిళలకు హెచ్ఐవీ సోకడంపై ఇంటర్నెట్ లో పెద్ద చర్చే జరుగుతోంది. కొందరు అమ్మాయిలు పాశ్చాత్య పోకడలకు పోయి ఇలాంటి వాటికి అలవాటు పడ్డారని అంటుండగా.. మరికొందరు టాటూల కారణంగా హెచ్ఐవీ వచ్చే అవకాశం లేదంటున్నారు.

Advertisement

Next Story