- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Malala Simha Garjana : డిసెంబర్ 1న మాలల సింహగర్జన
దిశ, వెబ్ డెస్క్ : ఎస్సీ వర్గీకరణ(SC classification)ను సమర్థిస్తూ సుప్రీమ్ కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో అసంతృప్తితో రగిలిపోతున్న మాలలు వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమాలను ఉదృతం చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో డిసెంబర్ 1న మాలల సింహగర్జన సభ(Malala Simha Garjana)కు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపునిచ్చింది. శుక్రవారం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కో చైర్మన్ మంత్రి నర్సింహ్మయ్య(Narsimhamayya) మాలల సింహగర్జన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలల సింహగర్జన సభకు రాష్ట్రవ్యాప్తంగా మాలలు కదిలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
జాగో మాల చలో హైదరాబాద్ నినాదంతో మాలలు అంతా హైదరాబాద్ కు తరలిరావాలని కోరారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద కుల జనాభా మాలలదేనని, 30లక్షలు మంది మాలలు ఉన్నారన్నారు. మాలల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు మాలలు రాజకీయాలకు అతీతంగా సింహగర్జన సభకు హాజరుకావాలని కోరారు. మాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేక పోరాటంపై భవిష్యత్తు కార్యాచరణ సభలో ప్రకటించడం జరుగుతుందన్నారు.