- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tiger : నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న పెద్దపులి టెర్రర్
దిశ, వెబ్ డెస్క్ : నిర్మల్ జిల్లా(Nirmal district) వాసులు పెద్దపులు(Tigers)ల సంచారంతో భయాందోళనల మధ్య బిక్కుబిక్కుమంటు రోజులు వెళ్లదీస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. పెద్దపులి అడవిలో ఠీవిగా నడుస్తూ బండరాళ్లను ఎక్కి ముందుకెలుతున్న వీడియో వైరల్ గా మారింది. పులి సంచారంతో గ్రామా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ (Joint Adilabad) జిల్లా వాసులను పెద్దపులులు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం నిర్మల్ జిల్లా పెంబి మండలం బుర్క రేగిడిలో సంచరిస్తున్న పెద్ద పులి(Tiger) ఎద్దుపై దాడి చేసి చంపేసింది.
అంతకుముందు సారంగపూర్ మండలం మహబూబ్ ఘాట్ వద్ధ స్థానికులకు చిరుత కనిపించింది. ఒకవైపు చిరుతలు, ఇంకోవైపు పెద్దపులులు సైతం పశువులపై దాడి చేస్తుండటం జిల్లా ప్రజలను, రైతులను కలవరపెడుతోంది. వారం రోజుల క్రితం తిప్పేశ్వర్ నుంచి వచ్చిన పులి మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండలంలో మూడు ఆవులను, హాజీపూర్ మండలంలో రెండు గొర్రెలను చంపేసింది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అడవుల నుంచి పెద్దపులులు జిల్లాకు రాకపోకలు సాగిస్తున్నాయి. మరోవైపు అటవీశాఖ అధికారులు పులులు, చిరుతల సంరక్షణ కోసం చర్యలు ప్రారంభించారు.