- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పురుషులు జాగ్రత్త.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి..!
దిశ, ఫీచర్స్: మనిషికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. మానసిక, శారీరక ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే ఏదైనా సాధించవచ్చని అంటుంటారు. టెక్నాజీతో పాటు వేగంగా సాగే ఈ కాలంలో చాలా మంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలాంటి సమయంలో శరీరంలో కొన్ని మిర్పులు వస్తుంటాయి. అలాంటి మార్పులు మనల్ని హెచ్చరింస్తుంటాయి. వీటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అయితే, నిరంతరం అలాంటి లక్షణాలు కనిపిస్తున్నట్లైతే.. వెంటనే వైద్యులను సంప్రదించి, వారి సలహాను తీసుకోవడం మంచిది. అవి ఎలాంటి లక్షణాలో ఇప్పుడు తెలుసుకోండి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: అకస్మాత్తుగా లేదా నిరంతరంగా శ్వాస ఆడకపోవడం వంటి విషయంలో వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ముఖ్యంగా శరీరక శ్రమ సమయంలో, విశ్రాంతి సమయంలో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నట్లైతే దీనిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఇది ఆస్తమా, క్రానిక్ అబ్ట్ర్సక్టివ్ పల్మనరీ డిసీజ్(COPD) లేదా పల్మనరీ ఎంబోలిజం వంటి సమస్యలుకు దారితీస్తుంది.
ఛాతిలో నొప్పి: పురుషులు లైట్ తీసుకునే అత్యంత సాధారణ లక్షణాలలో ఛాతినొప్పి ఒకటి. ఇది వివిధ కారణాల వల్ల రావొచ్చు. కానీ, ఈ లక్షణాన్ని పట్టించుకోకపోతే అది భవిష్యత్తులో తీవ్రమైన పరిస్థితులకు కారణం అవుతుంది.
అలసట, నీరసం: ఏదైనా పని చేస్తున్నప్పుడు అలసటగా అనిపిస్తుంది. ఇది మామూలు విషయమేనని పట్టించుకోకుండా ఉంటారు. చిన్న పని చేసినా అలసటగా ఉందంటే అది మీ శరీరానికి ప్రమాదం కావొచ్చు. నిరంతరం అలసట, నీరసం, థైరాయిడ్ వంటి సమస్యలకు కారణం కావొచ్చు. అందుకే ఇలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
ఆకస్మాత్తుగా బరువు తగ్గడం: బరువు తగ్గడం అనేది క్యాన్సర్, హైపర్ థైరాయిడ్ లేదా జీర్ణ సమస్యలు వంటివి వచ్చే ప్రమాదం ఉందని తెలుపుతుంది. ఎలాంటి వ్యాయమం చేయకుండా..డైట్ ఫాలో అవ్వకుండా బరువు తగ్గుతుంటే దీనిని సాధారణ విషయంగా తీసుకోకండి. అకస్మాత్తుగా బరువు పెరుగుతున్నా ఇలాంటి సమస్యలకు కారణం అవుతుంది.
జీర్ణక్రియలో మార్పులు: జీర్ణక్రియలో వచ్చే ఆకస్మిక మార్పులు కూడా శరీరానికి హాని కలిగిస్తుంది. విరేచనాలు, మలబద్ధకం, మలంలో రక్తం రావడం వంటివి జీర్ణక్రియలో మార్పులను తెలియజేస్తుంది. దీనిని గుర్తించి వెంటనే తగిన చికిత్స తీసుకోవడం మంచిది.
వెన్నునొప్పి: ఈ రోజుల్లో చాలామంది వెన్నునొప్పి అనేది సాధారణ విషయంగా పరిగణిస్తారు. కానీ, ఇది నిరంతరంగా ఇబ్బంది పెడుతుందంటే ఇది వెన్నెముకలోని సమస్యలు, పెద్దపేగు క్యాన్సర్ లేదా మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుంది.
మూత్రంలో మంట: మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు మూత్రంలో మంట లేదా రక్తం రావడం వంటివి జరుగుతుంటే దీనిని నిర్లక్ష్యం చేయకండి. ఈ సంకేతాలు యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్లు, మూత్రపిండాల్లో రాళ్లు లేదా ప్రోస్టేట్ వంటి సమస్యలకు కారణం అవుతుందని తెలియజేస్తుంది. ఇలాంటి సందర్భాల్లో వైద్యులను సంప్రదించడం మంచిది.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.