- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
యాదగిరిగుట్టలో కార్తీక పౌర్ణమి సందడి...
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం భక్తులతో నిండిపోయింది. ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇప్పటికే ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం కార్తీక శుద్ధ పూర్ణిమ సందర్భంగా ఎనిమిది బ్యాచ్ లుగా ఆలయ అధికారులు వ్రతాలు నిర్వహిస్తున్నారు.
మొదటి బ్యాచ్ ఉదయం 5.30 గంటలకు ప్రారంభం అవగా, సాయంత్రం 7:00 కు చివరి బ్యాచ్ జరగనుంది. సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించుకోవడానికి సైతం భక్తులు విశేష సంఖ్యలో విచ్చేశారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులు కార్తీక దీపాలు వెలిగించుకునేందుకు కొండపైన మూడు చోట్ల, కొండ కింద రెండు చోట్ల కార్తీకదీపం ఆరాధన పేరుతో కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొండపైన శివాలయానికి సైతం భక్తులు విశేష సంఖ్యలో పోటెత్తారు.