ఊరికి వెళతానని చెప్పిన ఓ వ్యక్తి .. ఎక్కడికి వెళ్లాడంటే..

by Sumithra |   ( Updated:2022-10-06 10:55:22.0  )
ఊరికి వెళతానని చెప్పిన ఓ వ్యక్తి .. ఎక్కడికి వెళ్లాడంటే..
X

దిశ, తాండూరు : ఊరికి వెళతానని చెప్పి ఇంటినుంచి వెళ్లిన ఓ యువకుడు తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు. రైల్వే స్థంబానికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకరమైన సంఘటన తాండూరు పట్టణంలో జరిగింది. తాండూరు నుండి నానాపూర్ వెళ్లే రైల్వే ట్రాక్ మార్గంలో రైల్వే స్తంభానికి తన షర్ట్ తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి మృతుని కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకలోని పోసారం గ్రామానికి చెందిన జన్నారం అంజప్ప (26) రెండు సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం తాండూర్ కు వలస వచ్చాడన్నారు.

కూలీ పని చేస్తూ తన భార్య పిల్లలను పోషిస్తూ జీవనం సాగించేవాడని తెలిపారు. ఈ నెల 1వ తేదీన శనివారం ఊరికి వెళ్లి వస్తానని ఇంట్లో నుంచి వెళ్లాడని తెలిపారు. అప్పటి నుంచి అంజప్ప ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉన్నట్టు వారు తెలిపారు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఘటన జరిగినట్లుగా రైల్వే పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

ALSO READ : ఆ వ్యక్తి ఎలా మృతి చెందాడో తెలుసా..

Advertisement

Next Story