- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టాలి.. కేటీఆర్ ఆదేశాలు
దిశ, తెలంగాణ బ్యూరో : ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో 57 ఏళ్ల నిండిన 10 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం రాష్ట్రంలోని 33 జిల్లాల వివిధ పథకాల లబ్ధిదారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ విద్య, వైద్యం ప్రధాన అంశాలుగా ముందుకు సాగుతుందన్నారు. మహిళల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని.. చట్టసభల్లో సైతం 50% రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించామని వెల్లడించారు. త్వరలోనే బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని ములుగు సిరిసిల్ల జిల్లాలను హెల్త్ ప్రొఫైల్ చేసి 18 ఏళ్లు నిండిన వారందరి వివరాలనుసేకరించామని.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే సొంత జాగాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి సాయం చేయనున్నట్లు తెలిపారు. మహిళలు ఆర్థిక బలోపేతం కోసం వడ్డీ లేని రుణాలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహాయం, మహిళల భద్రతకు షీ టీమ్స్ ఏర్పాటు చేశామని.. బాలికల విద్యాలయం కోసం గురుకులాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
రక్షాబంధన్ వేడుకల్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు స్థానిక ప్రజాప్రతినిధులు అంతా భాగస్వామ్యం చేసి ఆనందోత్సవాల మధ్య రక్షాబంధన్ వేడుకలను నిర్వహించాలని సూచించారు. అన్ని మండల కేంద్రాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు కేసీఆర్ ఫ్లెక్సీలు, చిత్రపటాలకు రాఖీలు కట్టాలని పిలుపునిచ్చారు. 14 లక్షల మంది ఒంటరి మహిళలు వితంతు మహిళలకు పెన్షన్లు అందజేస్తున్నామని, 4 లక్షల మంది బీడీ కార్మికులకు పెన్షన్లు అందజేస్తున్న ఘనత టీఆర్ఎస్‌దే అన్నారు. రాష్ట్రంలో 973 గురుకులాల్లో ఐదు లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని.. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని వెల్లడించారు.