- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కన్న తల్లిని, ఉన్న ఊరిని అతడు మరువలేదు.. ఏం చేశాడో తెలుసా?
దిశ, తెలంగాణ బ్యూరో: కన్న తల్లిని ఉన్న ఊరిని మరవకూడదనే సామెతను అతడు ఒంటపట్టించుకున్నాడు. పుట్టిన ఊరి కోసం తనవంతుగా ఏదైనా చేయాలని భావించాడు. అటు జర్నలిస్టుగా రాణిస్తూ.. మరోవైపు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కూచనపల్లి గ్రామానికి చెందిన మడప రాజిరెడ్డి. గ్రామాభివృద్ధికి అన్ని ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి నిధులు మంజూరు చేయించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పటి వరకు దాదాపు రూ.30 లక్షలు మంజూరు చేయించాడు. ఆదివాసీ భవన్ నిర్మాణానికి తనవంతుగా సహకారమందించడంలో సక్సెస్ అయ్యారు. రాజిరెడ్డి 15 సంవత్సరాల నుంచి జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు. వృత్తిలో భాగంగా తనకు పరిచయం ఉన్న ప్రజా ప్రతినిధుల సహకారంతో గ్రామానికి అవసరమైన నిధులు తీసుకొస్తూనే.. తాను కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. తన గ్రామం మిగతా గ్రామాలతో పోటీపడే విధంగా అభివృద్ధి జరగాలని భావించారు. అందులో భాగంగా గ్రామాభివృద్ధి కోసం తపించారు. పార్టీలకతీతంగా చట్టసభల్లో ఉన్న నేతల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఐదుగురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే, ఎంపీ నిధులను ఆ గ్రామానికి తీసుకువచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతల ఫండ్స్ ను గ్రామానికి విడుదల చేయించారు. మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజా ప్రతినిధులచే నిధులను మంజూరు చేపించడంలో కీలకపాత్ర పోషించారు. గ్రామానికి ఆనుకొని ఉన్న మాలపల్లె వెళ్లే ఘాట్ రోడ్ ను ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు నిధులతో ఘాట్ రోడ్ నిర్మించారు.
కుచన పల్లి గ్రామ శివారు నుంచి హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువుకు వెళ్లే దారిలో పొంగులేటి సుధాకర్ రెడ్డి ఎమ్మెల్సీ ఫండ్ ను మంజూరు చేయించి మట్టి రోడ్డు పనులు పూర్తి చేయించారు. అలాగే గ్రామంలో సైడ్ డ్రైన్స్ నిర్మాణానికి సంబంధించి మాజీ ఎమ్మెల్సీలు సంతోష్ కుమార్, స్వామి గౌడ్ నిధులతో పనులు పూర్తయ్యేలా కృషి చేశారు. అప్పటి ఎమ్మెల్యే సతీష్ బాబు ద్వారా రెడ్డి భవన్ కు నిధులు మంజూరు చేయించడంలో కీలకపాత్ర పోషించారు. ఇక గ్రామంలో ఉన్న ఆదివాసులకు గ్రామంలో కమ్యూనిటీ హాల్ కట్టించాలని రాజిరెడ్డి అనుకున్నారు. అందుకోసం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో రూ.5 లక్షల ఫండ్ ను కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు కేటాయించేలా చేశారు. అయితే కమిటీ హాల్ కట్టేందుకు స్థలం లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో అప్పటి ఎమ్మెల్యే సతీష్ బాబుతో మాట్లాడి కలెక్టర్ సహకారం తో 10 గుంటల స్థలాన్ని ఆదివాసీ భవన్ కు మంజూరు చేయించేలా కృషిచేశారు. ఆ స్థలంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేటాయించిన రూ.5 లక్షలతో స్లాబ్ నిర్మాణం చేపట్టారు. మిగతా పెండింగ్ పనులకు ఎంపీ బండి సంజయ్ కుమార్ సహకారంతో మరో రూ.5 లక్షల నిధులను మంజూరు చేయించారు. దీంతో త్వరలోనే ఆదివాసులకు సంపూర్ణంగా కమ్యూనిటీ హల్ పూర్తికాబోతోంది. అయితే కమ్యూనిటీ హాల్ పూర్తి చేయించడంలో మడప రాజిరెడ్డి తీసుకున్న చొరవను ఆదివాసులు అభినందిస్తున్నారు.
ఇదిలా ఉండగా నేస్తం అనే స్వచ్ఛందసంస్థను ఏర్పాటు చేసి సొంతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కరోనా సమయంలో ఊరిలో మాస్క్ లు, ప్రతి ఇంటికీ శానిటైజర్లు అందించారు. నేస్తం సొసైటీ సభ్యులు వంశీ, కార్తీక్, రంజిత్, శ్రవణ్ తో ఎప్పటికీ టచ్ లో ఉంటూ గ్రామంలో ఎవరైనా పేదవారు మరణిస్తే బాధిత కుటుంబ సభ్యులకు తన సొంత డబ్బులతో 50 కిలోల బియ్యాన్ని అందిస్తున్నారు. యువతను క్రీడా రంగంలో ప్రోత్సహించడంలోనూ ముందున్నారు. పొట్లపల్లి గ్రామానికి చెందిన పేద దళిత వర్గానికి చెందిన సన్నీ అనే యువకుడికి ఎంబీబీఎస్ లో ఉచిత సీటు వచ్చినా.. చదువుకోవడానికి డబ్బులు లేకపోవడంతో.. సన్నీ చదువు కోసం తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని అప్పటి ఎంపీ, ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రతి ఏటా రూ. లక్ష చొప్పున ఐదేండ్ల పాటు రూ.5 లక్షలు అందించేలా చొరవ తీసుకున్నారు. కాగా ఇప్పటికి రెండేండ్లు పూర్తవ్వడంతో సదరు యువకుడికి రూ.2 లక్షలు కోమటిరెడ్డి అందించారు. ఇకపోతే కూచనపల్లి గ్రామం నుంచి మాలపల్లి, కూచన పల్లి నుంచి హుస్నాబాద్ వెళ్లే మార్గ మధ్యంలో బ్రిడ్జి లేకపోవడంతో రైతులు, గీత కార్మికులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. బ్రిడ్జి ఏర్పాటుపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.