- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Rajaiah: నా నోటికాడి బుక్కను గుంజుకుండు.. మాజీ ఎమ్మెల్యే రాజయ్య హాట్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: తన నోటికాడి బుక్కును గుంజుకుని తినేశాడని స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah), ఎమ్మెల్యే కడియం శ్రీహరి (MLA Kadiyam Srihari)పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ముందు కడియం శ్రీహరి (Kadiyam Srihari) తనపై కుట్రలు, కుతంత్రాలు చేశాడని ఫైర్ అయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా తనపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. కడియం అంతు చూసే వరకు నిద్రపోనని కామెంట్ చేశారు. ఏడాది కాలంగా స్టేషన్ ఘన్‌పూర్ (Station Ghanpur) నియోజకవర్గ ఫరిధిలో అభివృద్ధి పడకేసిందని.. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని ఆరోపించారు.
కడియం శ్రీహరి (Kadiyam Srihari)కి ఉన్నది అవకాశవాదమేనని అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లో ఉన్నట్లుగా.. కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో కడియం పప్పులు ఉడకబోవని సెటర్లు వేశారు. కడియం శ్రీహరి (Kadiyam Srihari) ఎమ్మెల్యే అయ్యాక బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని.. అలా చేస్తే ఏమాత్రం సహించేది లేదని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎవరికి వారే దుకాణాలు తెరుచుకున్నారని కామెంట్ చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) భార్య కూడా వసూళ్లకు పాల్పడుతోందని ఆరోపించారు. అదేవిధంగా కేబినెట్ మొత్తం రాష్ట్రాన్ని దోచుకుంటోందని.. కాంగ్రెస్ ప్రభుత్వమే (Congress Government) అవినీతిమయం అయిపోయిందని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు.