- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: వర్షం ఎఫెక్ట్.. కూలిన గాంధీ భవన్ ప్రహరీ.. పలు వాహనాలు ధ్వంసం
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ, ఏపీలో వర్షాలు దంచికొట్టడంతో మానవ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోగా, మరికొన్ని ప్రాంతాల్లో ఏకంగా ఇళ్లు కూలిపోతున్నాయి. ఈ క్రమంలో భారీ వర్షాలకు హైదరాబాదు నాంపల్లిలోని గాంధీభవన్ లో ప్రహారి కూలింది. పార్కింగ్ చేసిన కార్లపై గోడ కూలడంతో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. సమయానికి అందులో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కొద్ది సేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రిలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. సీఎస్, డీజీపీ, మున్సిపల్, విద్యుత్, పంచాయితీరాజ్, ఇరిగేషన్, హైడ్రా అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని, జిల్లాలో కలెక్టర్లు ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిల్ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆదేశారు జారీ చేశారు. ఇక ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకి రావద్దని సూచించారు.