Rain Alert : కొనసాగుతున్న వాయుగుండం.. రాష్ట్రంలో ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

by Rajesh |
Rain Alert : కొనసాగుతున్న వాయుగుండం.. రాష్ట్రంలో ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ మధ్య బంగాళఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ప్రస్తుతం పూరీ తీరానికి వాయవ్యంగా 40 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. గోపాల్ పూర్‌కు ఈశాన్యంగా 70 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఒడిశా నుంచి చిలకసరస్సు దగ్గరగా వాయుగుండం కొనసాగుతోంది. గంటకు 3 కి.మీ వేగంతో వాయుగుండం కదులుతోంది. వాయవ్యంగా కొనసాగుతూ ఒడిశా-ఛత్తీస్ గఢ్ మధ్య తీరం దాటే చాన్స్ ఉంది. 24 గంటల్లో ఒడిశా-ఛత్తీస్ గఢ్ సమీపంలో వాయుగుండం తీరం దాటనుంది. ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల్లోని జిల్లల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో సాయంత్రం వరకు వర్షం కురిసే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నేడు మంచిర్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed