Railways: ఆదాయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నాలుగో స్థానం

by Ramesh Goud |
Railways: ఆదాయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నాలుగో స్థానం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆదాయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నాలుగో స్థానం సంపాదించుకోగా.. ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ప్రతి ఏడాది రైల్వేశాఖ ఆదాయం, ప్రయాణికుల పరంగా అగ్రస్థానంలో ఉన్న రైల్వే స్టేషన్ల వివరాలను వెల్లడిస్తుంది. ఈ నేపథ్యంలోనే 2023-24 సంవత్సరానికి సంబంధించి ఎక్కువ ఆదాయం పొందిన రైల్వేస్టేషన్ల లిస్టును ప్రకటించింది. ఇందులో ఆదాయం పరంగా.. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అగ్రస్థానంలో ఉండగా.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరా రెండవ స్థానంలో ఉంది. అలాగే చెన్నైలోని ఎంజీఆర్ మూడో స్థానంలో, సికింద్రాబాద్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ఇక ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్, ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినల్, అహ్మదాబాద్ రైల్వేస్టేషన్లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ఆదాయంలో ముందంజలో ఉన్న న్యూఢిల్లీ స్టేషన్ నుంచి 3,337 కోట్లు రాగా.. హైరా స్టేషన్ నుంచి 1,692 కోట్లు వచ్చింది. అలాగే చైన్నై సెంట్రల్ నుంచి 1,299 కోట్లు, సికింద్రాబాద్ నుంచి 1,276 కోట్ల ఆదాయం సమకూరింది. 500 కోట్ల కంటే ఎక్కువ ఉన్న రైల్వేస్టేషన్లు 28 ఉన్నాయి. వీటిని నాన్ సబర్భన్ గ్రూప్-1 కేటగిరీలో చేర్చారు. ఇక ప్రయాణికుల పరంగా.. ముంబైలోని థానే రైల్వే స్టేషన్ నుంచి అత్యధికంగా 93.06 కోట్ల మంది ప్రయాణించారు. దీని తర్వాత ముంబైలోని కల్యాణ్ రైల్వేస్టేషన్ రెండో స్థానం దక్కించుకుంది. దీని నుంచి ఈ ఏడాది 83.79 కోట్ల మంది ప్రయాణించారు. ఈ రైల్వే స్టేషన్లలో ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రం మరిన్ని నిధులు కేటాయించనుందని రైల్వే అధికారి వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed