తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్

by Sathputhe Rajesh |   ( Updated:2024-02-03 05:42:06.0  )
తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వే శాఖ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. హై స్పీడ్ రైల్ కారిడార్‌ను రైల్వే శాఖ రెండు మార్గాల్లో ఏర్పాటు చేయనుంది. దీంతో విశాఖ టు శంషాబాద్ కు కేవలం 4.30 గంటల్లో చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టుకు వచ్చే నెలఖారులోగా ప్రాథమిక సర్వే పూర్తి కానుంది. శంషాబాద్ లో ప్రారంభమై విజయవాడ మీదుగా విశాఖ వరకు ఒక రూట్, విశాఖ పట్నం నుంచి విజయవాడ మీదుగా కర్నూలు వరకు మరో రూట్‌ను రైల్వే ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.20వేల కోట్లకు పైగా వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాకపోకలు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ గా పెరిగాయి. ప్రతిరోజు సుమారు 55 వేల మంది జాతీయ, 10 వేల మంది అంతర్జాతీయ ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తున్నారు. రైలు ప్రయాణీకులు, విమాన ప్రయాణీకులను దృష్టిలో ఉంచుకుని ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ ను ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ, విశాఖ పట్నం నుంచి శంషాబాద్‌కు, ఎయిర్ పోర్టు నుంచి ఈ రెండు నగరాలకు హై స్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణీకులకు భారీ వెసులుబాటు కలగనుంది.

Advertisement

Next Story

Most Viewed