- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
CM KCRపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రెండో రోజు విజయభేరి బస్సుయాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాటారంలో రోడ్డుషో నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ ఉత్సాహం చూస్తుంటే ఈ ఎన్నికలలో కేసీఆర్ ఓడిపోతారనిపిస్తుందన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగిందన్నారు. దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య పోరాటం జరుగుతుందన్నారు. అవినీతిని పక్క రాష్ట్రాలకు కేసీఆర్ కుటుంబం విస్తరించిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నాయన్నారు.
తెలంగాణ ప్రజలు రాజ్యాధికారం చేపట్టాలని కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. కానీ తెలంగాణలో అధికారం ఒక కుటుంబానికే పరిమితమైందన్నారు. దేశంలోనే అవినీతి ప్రభుత్వం తెలంగాణలో ఉందన్నారు. అవినీతి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ ప్రజలకు దూరమవుతూ వస్తున్నారన్నారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ ఎందుకు దర్యాప్తు చేయడం లేదన్నారు. సీఎం అవినీతిపై ఈడీ, సీబీఐ ఎందుకు ఫోకస్ పెట్టడం లేదన్నారు. గతంలో బీజేపీ బిల్లులన్నింటికీ బీఆర్ఎస్ మద్దతు తెలిపిందన్నారు. బీజేపీ, కేసీఆర్ కలిసి పనిచేస్తున్నారన్నారు.